అమ్మాయిపై వెకిలి చేష్టలు | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 8 2018 8:08 AM

Man Tries to Molest a Girl in Public in Hooghly Video Viral - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో షాకింగ్‌ వీడియో వెలుగు చూసింది. ఓ అమ్మాయిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. హూగ్లీ జిల్లా చిన్సూరా నగరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎగ్జిబిషన్‌కు తిలకిస్తున్న ఆమె వెనకాల నిల్చున్న ఓ వ్యక్తి వెకిలి చేష్టలకు దిగాడు. అయితే ఆ అమ్మాయి అతన్ని గమనించకపోగా, పక్కనే ఉన్న మహిళ గుర్తించి ఆమెను పక్కకు లాగింది. తనను గమనిస్తున్నారన్న విషయం అర్థమైన ఆ వ్యక్తి.. వెంటనే పక్కకు తప్పుకున్నాడు. ఘటన ఎప్పుడు జరిగింది? వీడియో ఎవరు  తీశారన్న అంశాలపై స్పష్టత లేదు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌ కాగా, విషయం మీడియా ఛానెళ్లకు పాకింది. నిందితుడి గుర్తించిన వారు తమకు సమాచారం ఇవ్వాలంటూ హూగ్లీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement