బాంబు పెట్టి చంపేస్తానంటూ ఎమ్‌పీకి బెదిరింపు | Man Threatens to Kill BJP MP Sakshi Mahraj in Bomb Attack | Sakshi
Sakshi News home page

బాంబు పెట్టి చంపేస్తానంటూ ఎమ్‌పీకి బెదిరింపు

Jun 17 2020 7:05 PM | Updated on Jun 17 2020 7:19 PM

Man Threatens to Kill BJP MP Sakshi Mahraj in Bomb Attack

లక్నో: ఉన్నావో పార్లమెంటు సభ్యుడు సాక్షి మహారాజ్‌ను బాంబు పెట్టి చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని ఉత్తర ప్రదేశ్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిని బిజ్నోర్‌ జిల్లాకు చెందిన గఫర్‌గా గుర్తించారు. ఈ క్రమంలో పోలీసులు మాట్లాడుతూ.. గఫర్‌ కువైట్‌లో ఉండగా సాక్షి మహారాజ్‌కు ఫోన్‌ చేసి బాంబు పెట్టి ఆయనను చంపేస్తానని బెదిరించాడు. ఎమ్‌పీ పిర్యాదుతో గఫర్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు అతడి మీద సెక్షన్ 504 (శాంతిని ఉల్లంఘించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం), సెక్షన్‌ 507 (క్రిమినల్ బెదిరింపు), ఐపీసీసెక్షన్ 66, ఇన్‌ఫర్మేషన్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశామని తెలిపారు. గఫర్‌ వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, సివిల్ ఐడి కార్డు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement