మణిపూర్‌లో ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలు బంద్! | Tensions Rise in Manipur Internet Services Suspended | Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలు బంద్!

Apr 14 2026 11:12 PM | Updated on Apr 14 2026 11:15 PM

Tensions Rise in Manipur Internet Services Suspended

మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలో ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్ 7న జరిగిన బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు భారీ నిరసనలు చేపట్టారు.

ఈ నిరసనల సమయంలో.. కుకీ తిరుగుబాటు గ్రూపులకు చెందిన వ్యక్తులు ప్రయాణిస్తున్నారని అనుమానంతో ఒక కారును నిరసనకారులు ఆపి దానికి నిప్పంటించారు. ఈ ఘటనతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారి, నిరసనకారులు.. భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కారులో ఉన్నవారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

నిరసనలు జిల్లా వ్యాప్తంగా విస్తరించాయి. చురాచాంద్‌పూర్కు వెళ్లే రహదారులు, అలాగే ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంకు వెళ్లే హైవేలను నిరసనకారులు బ్లాక్ చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఏప్రిల్ 7న బిష్ణుపూర్‌లోని ఒక గ్రామంలో.. ఐదేళ్ల బాలుడు, ఆరు నెలల చిన్నారి తమ ఇంట్లో నిద్రపోతుండగా బాంబు దాడి జరగడంతో  మృతి చెందారు. ఈ ఘటన ప్రజల మనసులను కదిలించింది. ఆగ్రహంతో నిరసనకారులు CRPF శిబిరం ఎదుట కూడా నిరసనలు చేపట్టగా, అక్కడ జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు.

ఈ దాడిలో ఐదేళ్ల బాలుడు, ఆరు నెలల చిన్నారి తమ ఇంట్లో నిద్రపోతుండగా బాంబు పేలడంతో మృతి చెందారు. ఈ ఘటన ప్రజల మనసులను కదిలించింది. ఆగ్రహంతో నిరసనకారులు CRPF శిబిరం ఎదుట కూడా నిరసనలు చేపట్టగా, అక్కడ జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు.

పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు మణిపూర్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. బిష్ణుపూర్, ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, థౌబల్, కాక్చింగ్ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. తప్పుడు సమాచార వ్యాప్తి, గుంపుల సమీకరణను అరికట్టడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యం.

ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రజల్లో శాంతి భద్రతలు పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. ఈ సంఘటన మణిపూర్ రాష్ట్రంలో శాంతి, సామరస్యాల అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement