లైవ్‌ వీడియో తీసి యువకుడు ఆత్మహత్య | Man Suicide In Facebook Live Streaming Karnataka | Sakshi
Sakshi News home page

లైవ్‌ వీడియో తీసి యువకుడు ఆత్మహత్య

Aug 1 2018 12:01 PM | Updated on Nov 6 2018 8:16 PM

Man Suicide In Facebook Live Streaming Karnataka - Sakshi

ఆత్మహత్య చేసుకున్న దేవరాజ్‌ (ఫైల్‌)

దొడ్డబళ్లాపురం : ప్రేమించిన అమ్మాయితో వివాహం జరిపించలేదనే మనస్తాపంతో ఒక భగ్న ప్రేమికుడు మొబైల్‌లో లైవ్‌ వీడియో తీసి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొడ్డ పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కల్లుపేటలో నివసిస్తున్న దేవరాజ్‌ (23) చిన్నప్పుడే తల్లితండ్రులను పోగొట్టుకున్నాడు. అవ్వ ఇంట్లో ఉండేవాడు. ఇటీవల ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమెతో వివాహం జరిపించాలని ఇరు వైపుల వారినీ కోరాడు. అయితే ఎవ్వరూ అంగీకరించకపోవడంతో సోమవారం సాయంత్రం తన మొబైల్‌లోనే వీడియో తీసి విషం తాగాడు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement