భార్య కాపురానికి రావడం లేదని... | Man Suicide Attempt In Nizamabad | Sakshi
Sakshi News home page

భార్య కాపురానికి రావడం లేదని...

Sep 16 2018 12:22 PM | Updated on Nov 6 2018 8:08 PM

Man Suicide Attempt In Nizamabad - Sakshi

వెంకట నర్సింహ్మ రావ్‌ మృతదేహం

బోధన్‌రూరల్‌(బోధన్‌): మండలంలోని సాలంపాడ్‌ గ్రామానికి చెందిన జి.వెంకట నర్సింహ్మ రావ్‌(36) అనే వ్యక్తి తన భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు బోధన్‌ రూరల్‌ ఎస్‌ఐ షేక్‌ యాకూబ్‌ తెలిపారు. సాలంపాడ్‌కు చెందిన జి.వెంకట నర్సింహ్మరావ్‌ రంగారెడ్డి జిల్లాలోని షేర్‌ లింగంపల్లి గ్రామానికి చెందిన సావిత్రి అనే మహిళను వివాహం చేసుకుని రంగారెడ్డి జిల్లాలో నివాసం ఉంటున్నాడన్నారు.

7 నెలల క్రితం భార్యతో కలహాలు రావడంతో భార్యతో గొడవ పడి సాలంపాడ్‌ గ్రామానికి వచ్చాడన్నారు. అప్పటి నుంచి తన భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో ఈనెల 9న ఒంటికు నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు యత్నించి తీవ్ర గాయాల పాల్యవడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి చికిత్సకు చేర్పించారు. శుక్రవారం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి అక్క కృష్ణవేణి ఫిర్యాదు మేరకు శనివారం ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement