
ముజఫర్ నగర్ : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రానందని ఓ వ్యక్తి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య లేని జీవితం తనకు వద్దని నిర్ణయించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజులుగా అత్తగారింట్లో ఉంటున్న భార్య ఇటీవలె ఆయనతో జీవించలేనని, కాపురం చేయలేనని తెగేసి చెప్పింది. అతడు ఎంత బ్రతిమాలుకున్నా రానంటూ నలుగురిలో అవమానించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఇంతేజార్ అనే వ్యక్తి విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముజఫర్‌నగర్‌లోని దాదేరూ అనే గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.