రాడ్‌తో చంపి శవాన్ని బాత్‌రూమ్‌లో పడేశాడు

Man Kills Girlfriend Over Allegations of Affair In New Delhi - Sakshi

న్యూఢిల్లీ : అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో తనతో సహజీవనం చేసున్నమహిళను ఇనుపరాడ్‌తో కొట్టి చంపిన ఘటన శుక్రవారం రాత్రి ఢిల్లీలో చోటుచేసుకుంది. నిందితుడు హత్య చేసి పారిపోతుండగా రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ 302 సెక‌్షన్‌ కింద నిందితుడు రామ్‌దాస్‌(42)పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.

వివరాల ప్రకారం.. ఢిల్లీలో నివసిస్తున్న రామ్‌దాస్‌కు ఇదివరకే పెళ్లైందని, భార్య అనుమతితో పాయల్‌ అనే మహిళతో సహజీవనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రామ్‌దాస్‌ తన భార్య పేరిట ఉన్న ప్లాట్లు కొనుగోలు విషయంలో పాయల్‌తో గొడవ జరగడంతో, కొన్ని వారాలుగా పాయల్‌ తన సోదరితో కలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అదే విషయమై మాట్లాడానికి పాయల్‌ రామ్‌దాస్‌ వద్దకు వచ్చింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో సహనం కోల్పోయిన రామ్‌దాస్‌ పాయల్‌ను ఇనుపరాడ్‌తో బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని బాత్రూంలో పడేసి, డోర్‌ లాక్ చేసి అక్కడినుంచి పారిపోయినట్లు వెల్లడించారు. విచారణ సమయంలో నేరానికి పాల్పడింది తానేనని నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top