రెండో పెళ్లి కోసం భార్య, కూతుర్ని చంపి..

Man Killed Wife And Daughter For Second Marriage - Sakshi

లాతేహార్‌(జార్ఖండ్‌) : ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలనే దురాలోచనతో భార్య, కూతుర్ని కిరాతకంగా నరికి చంపాడో వ్యక్తి.  అనంతరం పోలీసులు తనను ఎక్కడ అరెస్ట్‌ చేస్తారనే భయంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని లాతేహార్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇస్రాఫిల్‌ అన్సారీ గత సంవత్సర కాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.  

ఈ విషయమై అన్సారీ దంపతుల మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి.  ఎలాగైనా ఈ నెలలో ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అన్సారీ రెండో పెళ్లికి సిద్ధపడ్డ విషయం అతని భార్య షమీనా బేగం, కూతురు ఆస్మా పర్వీన్‌లకు తెలియడంతో అందుకు అడ్డుచెప్పారు. బుధవారం రాత్రి ఈ విషయంపై భార్య భర్తల మధ్య వాగ్వివాదం చేటుచేసుకుంది.

దీంతో అతని కోపం కట్టలు తెంచుకుంది. ఉన్మాదిగా మారిన అన్సారీ గొడ్డలితో భార్య, కూతుర్ని విచక్షణారహితంగా నరికి చంపాడు. కొద్ది సేపటి తర్వాత పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఈ విషయం గ్రామ ప్రజలకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top