వివాహేతర సంబంధం నెపంతో.. వృద్దుడి హత్య

Man Killed In Rangareddy - Sakshi

విచక్షణారహితంగా కత్తితో పొడిచి పోలీసులకు లొంగిపోయిన నిందితుడు

తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపణ

పథకం ప్రకారమే హత్య చేశారన్న కుటుంబీకులు

కోట్‌మర్పల్లి కల్లుదుకాణం వద్ద ఘటన

మర్పల్లి : ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మండల కేంద్రంలోని కోట్‌మర్పల్లి చౌరస్తా సమీపంలో కల్లు దుకాణం సమీపంలో గు రువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థాని కుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. మర్పల్లి గ్రామానికి చెందిన బేగరి తుల్జయ్య (70) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో కల్లు దుకాణంలో కల్లు కొనుగోలు చేసి  ఇంటికి వెళ్తుండగా కోట్‌మర్పల్లి చౌరస్తా సమీపంలో కల్లు దుకాణం పక్కనే అదే గ్రామానికి చెందిన బక్క మొల్లయ్య కత్తితో తుల్జయ్యపై దాడి చేశాడు.

మెడ, కడుపులో దారణంగా పొడిచాడు. తుల్జయ్య కడుపులో నుంచి అవయవాలు బయటపడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు పోలీస్‌ శాఖలో ఉద్యోగం చేస్తుండగా, చిన్నవాడు రాజు గ్రామంలోనే కరెంట్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.   

లొంగిపోయిన నిందితుడు...  

తుల్జయ్యను హత్య చేసిన అనంతరం బక్క మొల్లయ్య కిలోమీటర్‌ దూరంలో ఉన్న మర్పల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న తుల్జయ్యను తానే కత్తితో పొడిచి హత్య చేశానని పోలీసులకు వివరించాడు.  

వివరాలు సేకరించిన పోలీసులు  

తుల్జయ్య హత్య విషయం తెలుసుకున్న మర్పల్లి పోలీసులు మోమిన్‌పేట్, ధారూరు సీఐల సా యంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలను స్థానికులను, కుటుంబసభ్యుల ను అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుమారుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసుకొని  తుల్జయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

పథకం ప్రకారమే హత్య చేశారు..  

వయస్సు పైబడి వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రిని పథకం ప్రకారమే హత్య చేశారని తుల్జయ్య కుమారుడు రాజు కన్నీటి పర్యంతమయ్యాడు. తన తండ్రిని హత్య చేసిన బక్క మొల్లయ్యను పూర్తి స్థాయిలో విచారిస్తే అతని వెనక ఉన్నవారు బయటకొస్తారన్నాడు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని తుల్జయ్య కుటుంబీకులు పోలీసులను కోరారు. ఈ విషయమై మర్పల్లి ఎస్‌ఐ విఠల్‌రెడ్డికి వివరణ కోరగా హత్యకు గల కారణాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని, కేసు దర్యాప్తులో ఉందన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top