సోదరి పక్కన ప్రియుడ్ని చూసి... | Man Killed By GirlFriend Brothers In Mumbai | Sakshi
Sakshi News home page

సోదరి పక్కన ప్రియుడ్ని చూసి...

Jan 30 2019 11:52 AM | Updated on Jan 30 2019 12:21 PM

Man Killed By GirlFriend Brothers In Mumbai - Sakshi

ముంబై : తమ సోదరిని ప్రేమించినందుకు ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు ముంబైకి చెందిన ఓ ఇద్దరు సోదరులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబైలొని మలాడ్ ప్రాంతానికి చెందిన సైఫ్‌ అలీ షరాఫత్‌ అలీ(25) అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. తమ ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి సోదరులు వారి పెళ్లికి ఒప్పుకోలేదు.

ఇదిలా ఉండగా ఇంట్లో ఎవరూలేరని యువతి చెప్పడంతో అలీ మంగళవారం మధ్యాహ్నం ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. వాలిద్దరు ఇంట్లో ముచ్చటిస్తుండగా యువతి సోదరులు వసీం బద్రుద్దిన్‌ ఖాన్‌(19), అజ్మల్‌(23) అక్కడికి వచ్చారు. తమ సోదరి పక్కన కూర్చొని ఉన్న అలీని చూసి కోపంతో అతడిపై దాడికి దిగారు. మా చెల్లిని ప్రేమిస్తావా..నీకెంత ధైర్యమంటూ..కత్తితో అతడిని పొడిచేశారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న అలీని అక్కడే వదిలేని ఇద్దరు సోదరులు పారిపోయారు. స్థానికుల సాయంతో ఆ యువతి అలీని ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే అలీ మృతి చెందారని తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. పరారైన యువతి ఇద్దరు సోదరులను పట్టుకున్నామని, మరిన్ని వివరాల కోసం విచారణ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement