చికెన్‌ పకోడా అడిగిందని.. చిన్నారి హత్య | Man Killed Girl Child For Chicken Pakodi in Tamil Nadu | Sakshi
Sakshi News home page

చికెన్‌ పకోడా అడిగిందని.. చిన్నారి హత్య

Jul 18 2019 8:04 AM | Updated on Jul 18 2019 8:04 AM

Man Killed Girl Child For Chicken Pakodi in Tamil Nadu - Sakshi

చెన్నై, తిరువళ్లూరు: మద్యం మత్తులో ఉన్న యువకుడి వద్ద చికెన్‌ పకోడా అడిగినందుకు ఆవేశంతో చిన్నారిని బ్రిడ్జి నుండి కిందకు తోసి హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. అనంతరం బాలిక తీవ్రంగా గాయపడడంతో హత్య చేసి చిన్నారి ఇంటి సమీపంలో పడేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పకున్నాడు. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఐదేళ్ల చిన్నారి రెండు రోజుల క్రితం వెళ్లవేడు ఇటుక చాంబర్‌ వద్ద తీవ్ర గాయాలతో శవమై తేలిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై వెళ్లవేడు పోలీసులు చాంబర్‌లో పని చేసే విక్రమ్, నిలక్కర్‌తో పాటు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 

పోలీసుల విచారణలో నిలక్కర్‌కు మాత్రమే చిన్నారి హత్యలో ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించారు. పోలీసుల సమాచారం మేరకు, సంఘటన జరిగిన రోజు ఇంటి వద్ద ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని నిలక్కర్‌ అనే యువకుడు వెళ్లవేడు బజారుకు తీసుకెళ్ళాడు. అక్కడ చిన్నారికి మిఠాయిలు తీసి ఇవ్వడంతో పాటు మద్యం, చికెన్‌ పకోడా కూడా తీసుకున్నాడు. తిరిగి వస్తూ ద్విచక్ర వాహనాన్ని బ్రిడ్జి వద్ద ఆపి మద్యం సేవించడం ప్రారంబించాడు. ఈ సమయంలో చికెన్‌ పకోడా తింటుడగా, తనకు కావాలని బాలిక పదేపదే అడిగింది. దీంతో విసుగు చెందిన నిలక్కర్‌ బ్రిడ్జిపై నుండి చిన్నారిని కిందకు తోసేశాడు.  తీవ్ర గాయాల పాలయిన బాలికను హత్య చేసి చిన్నారి ఇంటికి సమీపంలో పడేసినట్టు నిలక్కర్‌ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు.  దీంతో పోలీసులు నిలక్కర్‌ను అరెస్టు చేసి కోర్టులో హజరుపరిచి పుళల్‌ జైలుకు తరలించారు. కాగా చికెన్‌ పకోడ అడిగిన పాపానీకి అభం శుభం తెలియనీ చిన్నారిని దారుణంగా హత్య చేసిన సంఘటన తల్లిదండ్రులను తీవ్ర శోకంలో ముంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement