ఫేస్‌బుక్కైంది 

Man Fraud Two Lakh From Women From FaceBook Contact - Sakshi

రూ.2 లక్షల నగలు కోల్పోయిన మహిళ 

యశవంతపుర : ఆన్‌లైన్‌లో పరిచయం వ్యక్తి మహిళ బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరు రాజరాజేశ్వరినగరకు చెందిన గృహిణి అశ్వినికి, జేపీ నగర 6వ స్టేజీలో నివాసం ఉంటున్న వినోద్‌ అలియాస్‌ మంజునాథ్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకున్నాడు. జూన్‌ 10న అతడు ఆమెకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపారు. ఆమె ఓకే చేసింది. అప్పుడప్పుడు చాటింగ్‌ చేసుకునేవారు. ఇటీవల తన చెల్లికి, తల్లికి ఆరోగ్యం బాగాలేదని, అర్జంటుగా డబ్బు కావాలని అశ్వినికి మంజునాథ్‌ కోరాడు. ఆమె తన వద్ద డబ్బులు లేవని చెప్పినా అతడు వినలేదు. ఆమె ఇంటికి వచ్చి ఆమె నుంచి రూ. రెండు లక్షలు విలువైన బంగారు గొలుసు, ఉంగరాలు, కమ్మలను మంజునాథ్‌ తీసుకున్నాడు. ఆ తరువాత అతడు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయ్యింది. ఫేస్‌బుక్‌లోనూ స్పందించడం లేదు.  మోసపోయానని బాధితురాలు జయనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top