ప్రియురాలి ప్రైవేట్‌ వీడియో అప్‌లోడ్‌ చేసి.. ఆ తర్వాత!

Man blackmails And Demand Rs 4 lakh Mumbai Model As Her Nude Video Shared In Social Media - Sakshi

ముంబై : నాలుగు లక్షల రూపాయలు ఇస్తే ప్రైవేట్‌ వీడియో డిలీట్‌ చేస్తానంటూ 30 ఏళ్ల మోడల్‌ను ఆమె ప్రియుడు వేధించిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఈ విషయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ముంబైకి చెందిన 30 ఏళ్ల మోడల్‌  గత ఏడాది సామాజిక మాధ్యమాల్లోని బిగ్గో అనే యాప్‌లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడిందని పోలీసులకు తెలిపింది. అతను తన స్నేహితుడితో కలిసి సౌదీ అరేబియాలో పనిచేస్తుంటాడని, దీంతో తన ఫోన్‌ నంబర్‌ను అతని స్నేహితుడికి ఇవ్వడంతో సోషల్‌ మీడియా ద్వారా వారిద్దరు కలుసుకున్నట్లు తెలిపింది. పరిచయమైన ఏడాది తర్వాత వారిద్దరు వీడియో చాటింగ్‌ ద్వారా మాట్లాడుకునేవారని, ఈ క్రమంలో అతను తనని ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని నమ్మించినట్లు బాధితురాలు పేర్కొంది.

ఓ  రోజు తన నగ్న వీడియో పంపించమని అడగగా దానికి తాను అంగీకరించి పార్షల్‌ న్యూడ్‌ వీడియో పంపించినట్లు తెలిపింది. అయితే వీడియోని ఆన్‌లైన్‌లో ఎడిట్‌ చేసినట్లు చెప్పింది. అప్పటి నుంచి నిందితుడు ఫోన్‌ చేసి రూ. 4 లక్షలు ఇవ్వాలని లేదంటే ఈ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానంటూ బెదించాడు. దానికి ఆమె నిరాకరించడంతో వీడియో తన స్నేహితులకు  పంపించి, అదే యాప్‌ అప్‌లోడ్‌ చేశాడని ఈ విషయం తన స్నేహితుడి ద్వారా తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసుపై బంగూర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top