సైకిల్‌ దొంగిలించాడని.. | Man Beaten To Death In Medak Over Bicycle Theft | Sakshi
Sakshi News home page

సైకిల్‌ దొంగిలించాడని..

Sep 15 2019 8:16 AM | Updated on Sep 15 2019 8:16 AM

Man Beaten To Death In Medak Over Bicycle Theft - Sakshi

మనోహరాబాద్‌ (తూప్రాన్‌) : సైకిల్‌ చోరీకి యత్నించిన వ్యక్తిని చితకబాదడంతో మృతి చెందిన సంఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కాళ్ళకల్‌ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండలం ఐలాపూర్‌ గ్రామానికి చెందిన మహారాజుల నాగరాజు (31) తన కుటుంబంతో కలిసి ఆరేళ్ల కిందట కాళ్ళకల్‌ గ్రామానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. శుక్రవారం రాత్రి తాగినమత్తులో ఇక్కడి ఓ ఇంటి ముందు ఉన్న సైకిల్‌ చోరీ చేస్తుండగా గమనించిన సైకిల్‌ యజమానితో పాటు, మరో ముగ్గురు నాగరాజును కట్టేసి చితకబాదారు. అనంతరం స్థానికులు సర్పంచ్‌ మల్లేశ్‌కు సమాచారం అందించగా.. ఆయన ఆదేశాలతో గ్రామ సేవకుడు వెళ్లి నాగరాజును విడిపించుకుని ఇంట్లో అప్పగించాడు.

రాత్రి నిద్రపోయిన నాగరాజును తెల్లవారు జామున కుటుంబసభ్యులు లేపేందుకు ప్రయతి్నంచగా అప్పటికే ప్రాణాలు విడిచాడు. నాగరాజుకు భార్య అర్చన, కూతుళ్లు అక్షయ, సింధూజ ఉన్నారు. భార్య అర్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కమలాకర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement