రూ. 9 కోట్ల విలువైన పాము స్మగ్లింగ్‌ | Man Arrested With Rare Snake Species In Bengal | Sakshi
Sakshi News home page

రూ. 9 కోట్ల విలువైన పాము స్మగ్లింగ్‌.. వ్యక్తి అరెస్ట్‌

Nov 24 2018 4:10 PM | Updated on Nov 24 2018 4:32 PM

Man Arrested With Rare Snake Species In Bengal - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అత్యంత విషపూరితమైన ఈ పాము విలువ రూ. 9 కోట్లు

కోల్‌కతా : అరుదైన రకానికి చెందిన పామును స్మగ్లింగ్‌ చేస్తున్న ఓ వ్యక్తిని పశ్చిమ బెంగాల్‌ పోలీసులు అరెస్టు చేశారు. మల్దా జిల్లా పరిసర ప్రాంతాల్లో కనిపించే తక్షక్‌ జాతికి చెందిన ఆ పాము విలువ సుమారు 9 కోట్ల రూపాయలని వెల్లడించారు. వివరాలు...కోల్‌కతాకు చెందిన ఇషా షేక్‌ అనే వ్యక్తికి అరుదైన జంతుజాలాల స్మగ్లింగ్‌ ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో తక్షక్‌ పామును వారికి అమ్మేందుకు 9 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ డీల్‌ ప్రకారం జార్ఖండ్‌కు పామును తరలించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు బ్యాగును పరిశీలించిగా పాము కనిపించడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

కాగా పశ్చిమ బెంగాల్‌లోని కలియాచాక్‌ అడవుల్లో కనిపించే ఈ పాములు అత్యంత విషపూరితమైనవి. చూడటానికి బల్లిలా ఉండే తక్షక్‌ పాముల నుంచి సేకరించిన విషాన్ని పలు రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే మార్కెట్‌లో ఇవి భారీ ధర పలుకుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement