గర్బవతియైన భార్యను చంపడానికి సుపారి!

UP Man Arrested For Kills Pregnant Wife Had Affair With Wife's Sister - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గర్భవతియైన మహిళను భర్త దుండగులతో చంపించిన ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ క్రమంలో మృతురాలి భర్తను పోలీసులు బుధవారం అరెస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాల ప్రకారం... నిందితుడికి తన భార్య సోదరితో కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉందని, దీంతో అడ్డుగా ఉన్న తన భార్యను అడ్డు తొలగించుకోవడానికి నిందితుడు పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటన జనవరి 12న జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిందితుడిని విచారించగా.. ‘నా భార్య సొదరితో నాకు వివాహేతర సంబంధం ఉంది. అందుకే నా భార్యను చంపించాలనుకున్నాను. ఇందుకోసం తనకు విషం ఇచ్చి హత్య చేయమని దుండగులకు సుపారి కూడా ఇచ్చాను’ అని చెప్పాడు.

కాగా ఆ దుండగులు తన భార్యకు విషం ఇవ్వడంలో రెండుసార్లు విఫలమయ్యారని నిందితుడు పోలీసులకు చెప్పాడు. ఆ తరువాత దొంగతనం నెపంతో తమ ఇంటికి వెళ్లి.. భార్య గొంతు కోసి చంపారని  నిందితుడు చెప్పాడు. అదేవిధంగా తన పిల్లలను చూసుకోవడానికి తన భార్య సొదరిని తనతోనే ఉంచాలని నిందితుడు పోలీసులను కోరాడు. కేసు విచారణలో భాగంగా నిందితుడి ఇంటి సీసీ కెమెరాలను పరిశీలించగా.. తన భార్యను చంపడానికి నిందితుడు ముగ్గురు వ్యక్తులను నియమించినట్లు  తేలిందని పోలీసులు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top