నల్లగొండ గుట్టపై విషాదం | Lovers Commits Suicide In Jagtial District | Sakshi
Sakshi News home page

నల్లగొండ గుట్టపై విషాదం

Jun 28 2018 11:16 AM | Updated on Nov 6 2018 8:16 PM

Lovers Commits Suicide In Jagtial District - Sakshi

జగిత్యాల జిల్లాలో ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది.

సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కొడిమ్యాల మండలం నల్లగొండ గుట్టపై ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌ పల్లి మండలం హసన్కుర్తి గ్రామానికి చెందిన గౌతమి(20), ప్రశాంత్‌(21) ప్రేమించుకున్నారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమజంట రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో వారి కుటుంబసభ్యులు కమ్మరపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం గుట్టపై ఓ చెట్టుకు రెండు మృతదేహాలు వేలాడుతూ ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో దొరికిన సిమ్‌ కార్డు ఆధారంగా పోలీసుల వివరాలు సేకరించి, ప్రేమజంట కుటుంబ సభ్యులకు తెలియజేశారు. గుట్టపైన ఆనవాళ్లను బట్టి ప్రేమికుల ఆత్మహత్య నెల క్రితం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement