రెండేళ్లు సహజీవనం కొడుకు పుట్టాక?

Lover Cheating Case In Karimnagar - Sakshi

గోదావరిఖని(కరీంనగర్‌): ప్రేమించి, సహజీవ నం చేసి, కొడుకు పుట్టాక పెళ్లి చేసుకుని, ఇప్పుడు కాదంటున్నాడని ఓ మహిళ తన భర్త ఇంటి ఎదు ట ఆందోళనకు దిగింది. హనుమాన్‌నగర్‌కు చెందిన రామస్వామి తనతో రెండేళ్లు సహజీవనం చేసి ఇప్పుడు కాదంటున్నాడని తనకు న్యాయం చేయా లని గోదావరిఖనికి చెందిన దామెర సునీత అతడి ఇంటి ఎదుట బైటాయించింది. అతన్ని నమ్మి ఆర్టీసీ కండక్టర్‌ ఉద్యోగం కూడా వదులుకున్నానని, ఈఏడాది చర్చిలో పెళ్లి చేసుకున్నామని తెలిపింది.

ఇప్పటికే పెళ్లిచేసుకున్న భార్య పిల్లలు వద్దంటున్నారనే కారణాన్ని సాకుగా చూపి తనకు అన్యాయం చేస్తున్నాడని, పోలీసులు న్యాయం చే యాలని వేడుకుంది. సునీత ఫిర్యాదుతో కేసును కరీంనగర్‌ ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటర్‌కు పంపిస్తున్నట్లు సీఐ వాసుదేవరావు వివరించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top