‘నిజంగా నీకు ధైర్యం ఉంటే చచ్చిపో’ | Lover Challenge Took Bengaluru Girl Life | Sakshi
Sakshi News home page

Nov 2 2018 3:42 PM | Updated on Nov 6 2018 8:08 PM

Lover Challenge Took Bengaluru Girl Life - Sakshi

నువ్వు చనిపోతే నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను

బెంగళూరు : ఒకప్పుడు ‘నువ్వు లేకపోతే జీవితమే లేదు’ అన్నవాడు.. ఇప్పుడు ‘నువ్వు చచ్చిపో.. నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను’ అన్నాడు. ‘నీకు నిజంగా ధైర్యం ఉంటే చచ్చిపో’ అంటూ ప్రేమించిన యువతికి సవాల్‌ విసిరాడు. ప్రేమించినవాడే చచ్చిపో అనడాన్ని తట్టుకోలేని సదరు యువతి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

వివరాలు.. బెంగళూరుకు చెందిన దివ్య ఒక ప్రైవేట్‌ కాలేజ్‌లో డిగ్రి చదువుతోంది. ఈ క్రమంలో హరిష్‌ అనే యువకుడు దివ్యను ప్రేమిస్తున్నానంటూ ఆమె జీవితంలోకి వచ్చాడు. తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరని భావించిన దివ్య - హరీష్‌లు నాలుగు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. అనంతరం దివ్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలో దివ్య తనను వివాహం చేసుకోవాల్సిందిగా హరీష్‌ మీద ఒత్తిడి తీసుకొచ్చింది. దివ్యను వదిలించుకోవాలని భావిస్తోన్న హరీష్‌ 15 లక్షల రూపాయలు ఇస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

ఒక వేళ తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటూ దివ్యను బెదిరించాడు. అతని మాటలకు భయపడిన దివ్య అలా చేయవద్దంటూ వేడుకుంది. ఇలా వీరిద్దరి మధ్య సాగిన సంభాషణల్లో హరీష్‌ ‘నువ్వు చనిపోతే నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాన’ని మెసేజ్‌ చేశాడు. తర్వాత ‘నీకు నిజంగా ధైర్యం ఉంటే చచ్చిపో’ అంటూ మరో సందేశం పంపించాడు. ప్రేమించిన వాడే చావమనడంతో విరక్తి చెందిన దివ్య విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. దివ్య ఆత్మహత్య విషయం తెలుసుకున్న హరీష్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. దివ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేస్‌ నమోదు చేసిన పోలీసులు హరీష్‌ కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement