ప్రేమ పెళ్లి.. దంపతుల ఆత్మహత్య | Love Married Couple Commit End Lives in Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేమ పెళ్లి చేసుకున్న యువ దంపతుల ఆత్మహత్య

May 14 2020 7:26 AM | Updated on May 14 2020 7:26 AM

Love Married Couple Commit End Lives in Hyderabad - Sakshi

జయకుమార్, విజయలక్ష్మి(ఫైల్‌)

చెన్నై,వేలూరు(తిరువణ్ణామలై): తానియంబట్టు సమీపంలో ప్రేమ పెళ్లి చేసుకున్న నెల రోజుల్లోనే యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పలువురిని కలిసి వేసింది. వివరాల్లోకి వెలితే తిరువణ్ణామలై జిల్లా తానియంబట్టు తాలుకా మోదకాల్‌ గ్రామానికి చెందిన వేటియప్పన్‌ కుమారుడు జయకుమార్, క్రిష్ణగిరి జిల్లా కల్లూరు గ్రామానికి చెందిన విజయలక్ష్మిలు గత మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. మొదట్లో ఇద్దరి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి నిరాకరించారు. దీంతో విజయలక్ష్మి జయకుమయార్‌ తప్ప మరెవరినీ వివాహం చేసుకోనని పట్టుబట్టడంతో ఇద్దరు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గత నెల 6వ తేదీన ఓ ఆలయంలో వివాహం జరిపించారు. ప్రస్తుతం ఈ యువ జంట మోదకాల్‌ గ్రామంలో నిసిస్తున్నారు.

ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దంపతులు ఇద్దరూ ఇంటి నుంచి బయటకు రాక పోవడంతో అనుమానించిన స్థానికులు ఇంటి తలుపులు తెరిచి చూశారు. ఆ సమయంలో ఇద్దరూ ఇంటిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతదేహాలుగా వేలాడుతున్న వాటిని గమనించారు. దీంతో స్థానికులు తానేపాడి పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆర్‌డీఓ శ్రీదేవి ప్రత్యేకంగా విచారణ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement