ప్రేమజంట ఆత్మహత్య | Love Couple Commits Suicide In Tamil nadu | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్య

Dec 5 2018 1:13 PM | Updated on Dec 5 2018 1:13 PM

Love Couple Commits Suicide In Tamil nadu - Sakshi

మృతి చెందిన మిదింగనర్సరీ, రోమళప్రేమ

అన్నానగర్‌: అసోం రాష్ట్రానికి చెందిన ప్రేమజంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నెగమమ్‌ సమీపంలో సోవారం చోటుచేసుకుంది. అసోం రాష్ట్రానికి చెందిన మిదింగనర్సరి (19), రోమళాప్రేమ (18). వీరిద్దరూ కోయంబత్తూరు జిల్లా నెగమమ్‌ సమీపం కాట్టమ్‌పట్టిలో ఉన్న ప్రైవేటు కోళ్ల ఫాంలో పనిచేస్తున్నారు.  వీరిద్దరూ ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయాన్ని తమ కన్నవారికి తెలిపారు. ఇందుకు వారి కన్నవారు, అసోంకి రండి, అక్కడ వివాహం చేసుకోవచ్చునని తెలిపారు.

కానీ అక్కడికి వెళితే తమ ప్రేమను కన్నవారు అంగీకరించరని అక్కడికి వెళ్లడానికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అసోం వెళ్లకుండా ఇద్దరూ ఇక్కడే వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. కానీ కన్నవారి అంగీకరాం లేకుండా వివాహం చేసుకుంటే సమస్య ఏర్పడుతుందని మిదింగనర్సరి, రోమళాప్రేమ సోమవారం కోళ్ల ఫాంలో వేర్వేరు గదుల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement