ఏసీబీకి పట్టుబడ్డ డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌

Lady Drug Inspector Caught To ACB While Taking Bribe In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్: లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలను లంచంగా తీసుకుంటున్న డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌ లక్ష్మీను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శనివారం అరెస్ట్‌ చేసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నగరంలోని ఓ బ్లడ్ బ్యాంక్‌కు అనుకూలంగా రిపోర్టు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసింది. దీంతో సదరు వ్యక్తులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో లక్ష్మీ లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు పట్టుబడింది. కాగా గతంలోనూ ఆమె ఇదే బ్లడ్ బ్యాంకు నుంచి 50 వేలు లంచం తీసుకున్నట్లు అధి​కారులు గుర్తించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top