హైవేపై దోచుకునే కంజారా ముఠా అరెస్ట్‌ | Kurnool Police Arrested Kanjara Gang Who Exploit On Highway | Sakshi
Sakshi News home page

హైవేపై దోచుకునే కంజారా ముఠా అరెస్ట్‌

Nov 28 2019 2:48 PM | Updated on Nov 28 2019 4:21 PM

Kurnool Police Arrested Kanjara Gang Who Exploit On Highway - Sakshi

సాక్షి, కర్నూలు: జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలనే టార్గెట్‌గా చేసుకుని.. దోచుకునే కరుడుగట్టిన దోపిడీ దొంగల ముఠా గుట్టును కర్నూలు జిల్లా పోలీసులు రట్టు చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠాను గురువారం పోలీసులు వలపన్ని హైవేపై సినీ ఫక్కీలో అరెస్ట్ చేశారు. దోపిడీ దొంగల ముఠాను మధ్యప్రదేశ్‌కు చెందిన కంజారా ముఠాగా గుర్తించిన పోలీసులు.. వారి నుంచి 85 మొబైల్‌ ఫోన్లు, పట్టుచీరలు, 2 లారీలు, మరణాయుధాలతో పాటు ఔషధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హైవేపై కొరియర్ వాహనాలనే లక్ష్యంగా చేసుకుని.. దాడి చేసి కొల్లగొట్టే కంజారా ముఠా ఇప్పటివరకూ కర్నూలు జిల్లాలో నాలుగు చోట్ల దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement