కశ్మీర్‌లో జవాన్‌ దారుణ హత్య | Kashmir militants kill Territorial Army jawan | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో జవాన్‌ దారుణ హత్య

Nov 26 2017 2:21 AM | Updated on Jul 30 2018 8:37 PM

Kashmir militants kill Territorial Army jawan - Sakshi - Sakshi

శ్రీనగర్‌: ప్రాదేశిక సైన్యంలో పనిచేస్తున్న ఇర్ఫాన్‌ అహ్మద్‌ దార్‌ (23) అనే జవాన్‌ను దక్షిణ కశ్మీర్‌లోని సోపియాన్‌ జిల్లాలో మిలిటెంట్లు అపహరించి క్రూరంగా హత్య చేశారు. భారీ సంఖ్యలో బుల్లెట్లు తగిలిన దార్‌ మృతదేహాన్ని సోపియాన్‌లోని ఓ పళ్ల తోటలో గుర్తించామని అధికారులు శనివారం వెల్లడించారు.

బందిపోరా జిల్లాలో విధులు నిర్వర్తించే దార్‌ ఈ నెల 26 వరకు సెలవు తీసుకుని సోపియాన్‌కు వచ్చాడనీ, ఉగ్రవాదులే అతణ్ని అపహరించి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఘటనపై మరింత సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారన్నారు. జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement