
కరుణ మృతదేహం
సారంగపూర్(నిర్మల్): తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి పెళ్లికి నిరాకరించడంతో సారంగాపూర్ మండలం నాగపూర్ తండాకు చెందిన జాదవ్ కరుణ(19) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సారంగాపూర్‌కు చెందిన యువకుడు ఎస్‌కే బాబా కరుణను ప్రేమించాడు. అయితే మొన్నటివరకు పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన ఎస్‌కే బాబా ఇటీవల పెళ్లికి నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన కరుణ సోమవారం ఉదయం తన ఇంట్లో పంట కోసం నిలువ ఉంచిన పురుగుల మందు సేవించి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబీకులు వెంటనే నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కరుణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సారంగాపూర్ ఎస్సై సునీల్‌కుమార్ తెలిపారు.