ప్రముఖ హీరో అరెస్ట్‌ | Karnataka Hero Duniya Vijay Arrest In Tamil Nadu | Sakshi
Sakshi News home page

హీరో దునియా విజయ్‌ అరెస్ట్‌

Jun 9 2018 8:49 AM | Updated on Aug 20 2018 4:27 PM

Karnataka Hero Duniya Vijay Arrest In Tamil Nadu - Sakshi

యశవంతపుర : మాస్తిగుడి దర్శకుడు సుందర పి గౌడను అరెస్టు చేయటానికి వెళ్లిన పోలీసుల విధులకు అటంకం కలిగించిన కేసులో పరారీలో ఉన్న నటుడు దునియా విజయ్‌ని చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీసులు తమిళనాడులో శుక్రవారం అరెస్టు చేసి బెంగళూరుకు తీసుకు వచ్చారు.  2016 నవంబర్‌ 7న తిప్పగొండనహళ్లి చెరువులో మాస్తిగుడి సినిమా షూటీంగ్‌ చేస్తుండగా వర్తమాన నటులు ఉదయ్, అనిల్‌ నీటిలో మునిగి మృతి చెందారు. వీరి మృతికి దర్శకుడు సుందర పి గౌడ కారణమంటూ నలుగురిపై తావరకెరె పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై రామనగర కోర్టు అరెస్టు చేయాలని అదేశాలు జారీ చేసింది. అదే కేసుకు సంబంధించి సుందరగౌడను అరెస్టు చేయటానికి వెళ్లిన నటుడు దునియా విజయ్‌ అడ్డుకున్నారు.

అరెస్టు చేయటానికి వెళ్లిన పోలీసుల విధులకు అటంకం కలిగించరంటూ తావరెకెరె పోలీసు స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ గోవిందరాజు సికే అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే పోలీసులు దునియా విజయ్‌పై కేసు నమోదు చేసిన్నప్పుటి నుండి తప్పించుకు తిరుగుతున్నారు. ఐదు రోజుల పాటు బెంగళురు చుట్టు పక్కల తిరిగిన దునియా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారు. మొబైల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ అధారంగా తమిళనాడులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారించారు. శుక్రవారంలోపు కోర్టులో లొంగి పోయాలని రామనగర కోర్టు ఆదేశించింది. అయితే బెయిల్‌ కోసం ప్రయత్నిస్తుండగా పోలీసు వలపన్ని తమిళనాడు తల దాచుకున్న దునియా విజయ్‌ను అరెస్టు చేసి 65వ సెషన్స్‌ కోర్టు ముందు హాజరు పరచగా లక్ష రూపాయిల నగదు పూచీకత్తుపై జామీన్‌ మంజూరు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement