జేసీ ప్రభాకర్‌ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

JC Prabhakar Reddy Sent To 14 Days Remand - Sakshi

సాక్షి, అనంతపురం: దివాకర్‌ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో అరెస్టైన జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్‌ రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. అనంతరం పోలీసులు వారిద్దరినీ అనంతపురంలోని రెడ్డిపల్లి జైలుకు తరలించారు. అంతకు ముందు ప్రభాకర్‌ రెడ్డి, అస్మిత్‌ రెడ్డికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. కాగా, బీఎస్‌-3 వాహనాలను బీఎస్-‌4గా రిజిస్ట్రేషన్‌ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలను నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్‌పై 24 కేసులు నమోదయ్యాయి.
(చదవండి: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరెస్ట్‌)
(చదవండి: తీగలాగితే డొంక కదిలింది!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top