ఏపీ, తమిళనాడుల్లో వందచోట్ల ఐటీ దాడులు

IT dept raids 100 places in TN, AP in mining - Sakshi

చెన్నై/విశాఖ దక్షిణం/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఏపీ, తమిళనాడుల్లోని 100 చోట్ల ఆదాయ పన్ను(ఐటీ) శాఖ అధికారులు దాడు లు జరిపారు. వీవీ మినరల్స్‌ సహా నాలుగు ప్రముఖ సంస్థలు గనులు, ఖని జాల ఎగుమతుల సంస్థలు పన్ను ఎగవేతకు పాల్పడ్డాయనే ఆరోపణలతో సోదాలు జరిపినట్లు ఐటీ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం ఆరు గంటలకు ఐటీ బృందాలు విశాఖలోని లాజిస్టిక్‌ కంపెనీలు, ప్రముఖ చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ మురళీకృష్ణ కార్యాలయాలు, అక్కయ్య పాలెంలో ఆర్‌వీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఆఫీసు, అక్కయ్యపాలెంలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఇంట్లో దాడులు చేపట్టాయి. నక్కపల్లి మండలం బం గారమ్మపేట గ్రామంలో బీఎంపీ కంపెనీ ఆఫీ సులో సోదాలు చేశాయి.

ఈ కంపెనీ చెన్నై ప్రధాన కేంద్రంగా విశాఖ జిల్లా నక్కపల్లి, శ్రీకాకుళంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దువ్వాడలో గల టీజీఐ లాజిస్టిక్స్‌ లోనూ ఐటీ తనిఖీలు జరిగాయి. ఈ కంపెనీ తెలంగాణ టీడీపీ నేత దేవేందర్‌ గౌడ్‌ బంధువులదని సమాచారం. శ్రీకాకుళం జిల్లా గార మండలం సతివాడ వద్దనున్న ట్రాన్స్‌వరల్డ్‌ గార్నెట్‌ ఇండస్ట్రీ (టీజీఐ) ఆఫీసుతోపాటు రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ నడికుదిటిపాలెంలోని టీడీపీ నేత, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ డైరెక్టర్‌ నడికుదిటి ఈశ్వరరావు ఇంట్లో సోదాలు జరిపారు. తమిళనాడుకు చెందిన వీవీ మినరల్స్‌ యాజమాన్యంలో టీజీఐ నడుస్తోంది. చెన్నై, కోయంబత్తూరు, తిరునల్వేలి, ట్యుటికోరన్, కరైకల్‌లలోని వివిధ ఆఫీసులపై జరిపిన సోదాల్లో 130 మంది పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top