కాగజ్‌నగర్‌లో భారీ దోపిడీ | interstate thieves gang arrested in Kagaznagar | Sakshi
Sakshi News home page

కాగజ్‌నగర్‌లో భారీ దోపిడీ

Nov 7 2017 4:00 AM | Updated on Aug 30 2018 5:27 PM

సిర్పూర్‌(టి) : కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లోని రాజరాజేశ్వర రైసుమిల్లులో సోమవారం రాత్రి అంతర్రాష్ట్ర దొంగల ముఠా భారీ దోపిడీకి పాల్పడింది. మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌ అనే నంబర్‌ ప్లేట్లు కలిగిన వాహనాలు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ దుస్తుల్లో వచ్చిన దుండగులు రైస్‌మిల్లులోకి చొరబడి సిబ్బందిని బెదిరించి, రూ.16 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. రైసుమిల్లు యజమానులు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు ఆ ప్రాంతంలోని అన్ని ఠాణాల సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో సిర్పూర్‌(టి) పోలీస్‌స్టేషన్‌ వద్ద 12 మంది దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కాగజ్‌నగర్‌ డీఎస్పీ హబీబ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement