అంతర్‌ రాష్ట్ర డ్రగ్స్‌ ముఠా అరెస్ట్‌ | Interstate Drug Syndicate Arrested In Hyderabad | Sakshi
Sakshi News home page

అంతర్‌ రాష్ట్ర డ్రగ్స్‌ ముఠా అరెస్ట్‌

May 3 2019 4:52 PM | Updated on May 3 2019 5:23 PM

Interstate Drug Syndicate Arrested In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో మరోసారి డ్రగ్స్‌ ముఠా హల్‌చల్‌ చేసింది. డ్రగ్స్‌ విక్రయిస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. కమతిపురాకు చెందిన ఇష్క్‌ మొయినుద్దిన్‌ అనే కీలకవ్యక్తితో పాటు మరో నలుగురిని అరెస్ట్‌చేసినట్లు తెలిపారు. సినిమా అవకాశాల కోసం ముంబై వెళ్లిన మొయినుద్దిన్‌ డ్రగ్‌ పేడ్లర్‌గా మారి అమ్మకాలు చేస్తున్నాడని పేర్కొన్నారు. ముంబై వాసి అభిషేక్‌తో పరిచయం కావడం.. మరికొంత మంది ముఠాగా మారడంతో విక్రయాలు సాగిస్తున్నట్లు తెలిపారు.

వీరివద్ద నుంచి 28 గ్రాముల హెరాయిన్‌, ఆరు మొబైల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. హెరాయిన్‌కు మార్కెట్‌లో మంచి ధర ఉండటంతో సప్లై చేస్తున్నారన్నారు. సమద్‌ రైస్‌ ఖాన్‌, ఇష్క మొయినుద్దిన్‌, ఖాజా, వాజీద్‌, అభిషేక్‌ పారికర్‌లను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. సయ్యద్‌ అమీర్‌, షేక్‌ వహీద్‌, ఉస్మాన్‌ షేక్‌లు పరారీలో ఉన్నారని తెలిపారు. పరారీలో ఉన్న అభిషేక్‌ ముంబైలో ఉంటూ మొయినుద్దిన్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement