రూ. 1300కోట్ల విలువైన కొకైన్‌ స్వాధీనం

Narcotics Control Bureau Seized Rs 1,300 Crore International Drug Cartel In Delhi - Sakshi

న్యూఢిల్లీ : రూ.1300 కోట్ల విలువైన మాదకద్రవ్యాలకు సంబంధించి 9మందితో కూడిన అంతర్జాతీయ ముఠాను నార్కొటిక్‌ డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం అధికారులు శనివారం న్యూఢిల్లీలో పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వారి వద్ద నుంచి 20 కేజీల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు యాంటీ నార్కొటిక్‌ ఏజెన్సీ తెలిపింది. కాగా, ఈ ముఠా వెనుక పెద్ద హస్తం ఉన్నట్లు తెలుస్తుంది.. అంతర్జాతీయంగా ఆస్ర్టేలియా, కెనెడా, ఇండోనేషియా, శ్రీలంక, కొలంబియా, మలేషియా, నైజీరియా దేశాలతో పాటు దేశంలోని ఢిల్లీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్రలతో పాటు గ్రూపులుగా ఏర్పడి మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది.

కాగా ఈ ఆపరేషన్‌లో అరెస్టైన 9 మందిలో ఐదుగురు భారతీయులు, ఇద్దరు నైజీరియన్లు, ఒక అమెరికన్‌, మరోకరు ఇండోనేషిన్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారత్‌లో పట్టుకున్న మాదకద్రవ్యాల విలువ అంతర్జాతీయంగా రూ.100 కోట్లు, అలాగే కార్టెల్‌ విలువ సుమారు రూ. 1300 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆపరేషన్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో అక్కడి అధికారులు 55 కిలోల కొకైన్, 200 కిలోల మెథాంఫేటమిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top