విద్యార్థినిపై ఏడాదికాలంగా అత్యాచారం | Intermediate Student Raped By 7 People In Prakasam | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై ఏడాదికాలంగా అత్యాచారం

Dec 3 2018 7:49 PM | Updated on Dec 3 2018 7:51 PM

Intermediate Student Raped By 7 People In Prakasam - Sakshi

సాక్షి,  ప్రకాశం: మహిళలపై లైంగిక అకృత్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థినిపై తొమ్మిది మంది యువకులు ఏడాది కాలంగా  లైగికంగా హింసిస్తూ, పలుమార్లు అత్యాచారం జరిపారు.

ఈ దుర్మార్గంపై బాధితురాలు ఆదివారం గిద్దలూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, పరారీలో ఉన్న వారిని త్వరలో అరెస్టు చేస్తామని మార్కాపురం డీఎస్‌పీ ఎన్వీ రామాంజనేయులు విలేకరులకు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement