
అనామిక మృతదేహం
బన్సీలాల్‌పేట్: ఇంటర్ పరీక్షలో ఫెయిలైనందుకు మనస్తాపానికిలోనైన ఓ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం సాయంత్రం గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరి«ధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవీందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతానికి చెందిన గణేష్ కుమార్తె అనామిక(16) చాచానెహ్రునగర్‌లోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ప్రగతి మహావిద్యాలయ కాలేజీలో ఇంటర్మీడియట్ సీఈసీ చదువుతోంది. గురువారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె ఓ సబ్జెట్‌లో ఫెయిలయ్యింది. దీంతో మనస్తాపానికిలోనైన అనామిక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న గాంధీనగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.