వివాహేతర సంబంధం..యువకుడి హత్య | illigal affair..young man murder | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం..యువకుడి హత్య

Dec 26 2017 11:04 AM | Updated on Aug 1 2018 2:31 PM

illigal affair..young man murder - Sakshi

మహబూబాబాద్ : కురవి మండలం బలపాల శివారు లింగ్యా తండాలో బాణోత్ రవీందర్‌(29) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాలు..లింగ్యా తండాకు చెందిన బాణోత్‌ రవీందర్‌కు సునీత, ప్రమీల అనే ఇద్దరు భార్యలున్నారు. వీరిద్దరితో కలిసి హైదరాబాద్‌లోని షాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. అందరూ కలిసి ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం మొదటి భార్య సునీత, భర్తల గొడవలు జరిగాయి. మొదటి భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలియడంతో ఆమెను అత్తగారింటికి తీసుకొచ్చి పంచాయతీ చేశాడు.

ఇదే విషయంలో పంచాయతీ కొనసాగుతుండగా రవీందర్‌ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ముసుగు ధరించి కారులో వచ్చారని, వాళ్లే గొంతు నులిమి చంపేశారని రవీందర్‌ కుమారుడు మనోజ్‌ చెబుతున్నాడు. పెనుగులాటలో ముఖంపై గోళ్లతో గీకిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి.  పెద్ద భార్య సునీతనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement