ఏడేళ్లుగా సహజీవనం చేశారు.. చివరికి

Illegal Affairs Women Muder In Srikakulam - Sakshi

వీరఘట్టం: వారిద్దరూ ఏడేళ్ల పాటు సహజీవనం చేశారు. నిత్యం మద్యం సేవించి వచ్చి ఇష్టం వచ్చి ఆమెను నిత్యం చిత్ర హింసలు పెట్టేవాడు. చివరకు ఆమెపై అనుమానం పెరిగి శుక్రవారం హతమార్చాడు. వివరాల్లోకి వెళితే వీరఘట్టం మేజరు పంచాయతీలోని కొట్టుగుమ్మడ రోడ్డు నక్కలపేటలో నివాసముంటున్న చెరుకుబిల్లి బాలరాజు, సరోజిని(45) ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి తాము నివాసముంటున్న మేడపై నిద్రించేందుకు వెళ్లారు. మేడపైకి వెళ్లిన కొద్ది సేపటికే ఇద్దరి మధ్య తగాదా ప్రారంభమైంది.

సరోజినిని విచక్షణా రహితంగా కొట్టడంతో ఆమె స్పహకోల్పోయింది. వెంటనే ఆమెను మేడపై నుంచి కిందకు తోసేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కింద పడిన సరోజిని తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. 108లో పాలకొండ ఏరియా ఆస్పత్రి తరలించారు. రక్తం అధికంగా పోవడంతో సరోజిని వైద్య చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే శుక్రవారం అర్ధ రాత్రి మృతి చెందింది.

ఏడేళ్ల కిందట పరిచయం..
బాలరాజుకు 15 ఏళ్ల క్రితం అమదాలవసకు చెందిన యువతితో వివాహం అయింది. 8 ఏళ్ల క్రితం వీరిద్దరు విడిపోయారు. సరోజినికి 9 ఏళ్ల క్రితం వీరఘట్టం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. పెళ్లి అయిన రెండేళ్లకే విడిపోయారు. ఏడేళ్ల క్రితం బాలరాజు, సరోజినిల మధ్య పరిచయం ఏర్పడింది. 

కేసు నమోదు
మృతురాలి అన్న గొలుసు తవుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ జి.అప్పారావు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ షయం తెలియడంతో శనివారం సాయంత్రం పాలకొండ డీఎస్పీ జి.ప్రేమకాజల్, సీఐ జి.శ్రీనివాసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిసరాలు పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.  నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top