పిల్లలకు బైకిస్తే పెద్దలు జైలుకే..  

if kids run the bike Parents will be jail - Sakshi

హెచ్చరిస్తున్న పోలీసులు

సిద్దిపేట కమిషరేనట్‌ పరిధిలో ముమ్మర తనిఖీలు

పట్టుబడ్డ మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌

నేరం రుజువైతే 6 నెలల జైలు

సిద్దిపేటటౌన్‌ : మైనర్లు వాహనాలు నడుపుతూ వారి ప్రమాదాలకు గురవడమే కాకుండా, ఇతరులకు ప్రాణాల మీదకు తెస్తున్న ఘటనలు ఇటీవల అనేకం జరుగుతున్నారు. పిల్లలు ముచ్చట పడుతున్నారని, వారి సరదా తీర్చటం వారికి వాహనాలు ఇస్తే మోటర్‌ వెహికిల్‌ యాక్ట్‌ ప్రకారం పెద్దలను జైలుకు పంపుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే జంట నగరాల్లో పెద్ద ఎత్తున వాహనాలు నడుపుతున్న మైనర్లను పట్టుకుని వారితో పాటు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. మొదటి సారి పట్టుబడిన వారిని కౌన్సెలింగ్‌ ఇచ్చి విడిచిపెడుతున్నారు. మరో సారి పట్టుబడితే మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరంగా పరిగణించి వారి తల్లిదండ్రులను జైలుకు పంపించే అవకాశం ఉంది. 

కమిషనరేట్‌ పరిధిలో ముమ్మరంగా తనిఖీలు..

ఈ మేరకు సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో వాహనాలు నడుపుతున్న మైనర్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. సిద్దిపేట ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాస్‌ తన సిబ్బందితో కలిసి పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది ఇప్పటి వరకు వాహనాలు నడుతుపూ పట్టుబడిన సుమారు 60 మంది మైనర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వీరితో పాటు 18 సంవత్సరాలు నిండి డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వారు పట్టుబడితే వారి చేత డ్రైవింగ్‌ లైసెన్స్‌కోసం స్లాట్‌ బుకింగ్‌ చేయించి, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తెచ్చుకునేలా అవగాహన కల్పిస్తున్నారు.

మైనర్లతో పాటు ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసేవారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వీరు ఉద్ధ్యేశ పూర్వంగానే ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్నారని రుజువైతే వారికి 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పిల్లల సరదా తీర్చడం కోసం వారికి వాహనాలు ఇస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని పోలీలసులు సూచిస్తున్నారు.

మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమవుతున్న తల్లిదండ్రులకు గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా వారి క్షేమం కోసం సరదాలను పక్కన పెట్టాలని పోలీసులు కోరుతున్నారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు..

పిల్లలు మారాం చేసారని, ఇక్కడికి వరకే కదా అని వారికి వాహనాలు ఇస్తూ, అజాగ్రత్తగా వ్యవహరించే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడేది లేదు. డ్రైవింగ్‌ ఫర్‌ఫెక్ట్‌గా నేర్చుకుని డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగిన వారికే వాహనాలు ఇవ్వాలి. దీని వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఎంవీ యాక్టు ప్రకారం మైనర్లు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వారు వాహనాలు నడపడం చట్టప్రకారం నేరం. ఇలా నడుపుతూ పట్టుబడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.    –శ్రీనివాస్, సిద్దిపేట ట్రాఫిక్‌ సీఐ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top