భార్య ఉండగానే మరో యువతితో చాటింగ్‌.. తలాక్‌ | Husband Talaq to Wife Question to Chatting Other Women | Sakshi
Sakshi News home page

తలాక్‌ తలాక్‌.. తలాక్‌

May 27 2019 9:25 AM | Updated on May 27 2019 9:25 AM

Husband Talaq to Wife Question to Chatting Other Women - Sakshi

సయ్యద్‌ రెహమాన్‌ పెళ్లినాటి ఫొటో (ఫైల్‌)

ప్రశ్నించినందుకు  తలాక్‌ చెప్పిన భర్త  

బొమ్మనహళ్లి : మరో యువతితో చాటింగ్‌ చేయడాన్ని ప్రశ్నించడంతో భార్యకు తలాక్‌ చెప్పిన ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధితురాలు ఆర్టీనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు...యూఎస్‌ఏలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న యువతి అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న ఆర్టీనగరకు చెందిన సయ్యద్‌ రెహమాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరు కొంత కాలం అన్యోనంగా జీవించారు. మూడు నెలల తరువాత సయ్యద్‌ జులాయిగా తిరుగుతూ ఉద్యోగం మాని భార్య సంపాదనపై జల్సాలు చేయడం మొదలు పెట్టాడు.

అంతేకాకుండా మరో యువతితో నిత్యం చాటింగ్‌లు చేసేవాడు. ఏకంగా ఇంటికే పిలుచుకుని వచ్చేవాడు. దీంతో భార్య ప్రశ్నించడంతో ఆమెను నిత్యం వేధించి కొట్టేవాడు. దీంతో బాధితురాలు విషయాన్ని బెంగళూరులో ఉన్న తల్లిదండ్రులకు తెలిపింది. ఇటీవల ఇద్దరు బెంగళూరు చేరుకున్నారు. ఆర్టీనగరలో నివాసం ఉంటున్నారు. అయినప్పటికీ సయ్యద్‌లో ఎటువంటి మార్పు కనిపించలేదు. దీంతో ఏకంగా మరో వివాహం చేసుకోవడానికి యత్నించాడు. ఈ నేపథ్యంలో భార్యకు తలాక్‌ చెప్పాడు. దీంతో బాధితురాలు ఆర్టీనగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటి వరకు స్పందించలేదని బాధితురాలు వాపోయింది.   

Advertisement
 
Advertisement
Advertisement