భర్త చేతిలో భార్య హతం

Husband Killed Wife In PSR Nellore - Sakshi

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, మనుబోలు: కూతురి ప్రేమ, పెళ్లి విషయం తనకు చెప్పలేదనే అక్కసుతో భార్యపై  భర్త ఇనుపరాడ్‌తో దాడిచేసి హత్య చేశాడు. ఈ ఘటన మండలంలోని జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. అక్కంపేటకు చెందిన రాపూరు శ్రీనివాసులు, వెంకటరమణమ్మ (39) దంపతులు కొంత కా లంగా మనుబోలు కోదండరామపురంలో నివాసముంటున్నారు. శ్రీనివాసులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, కొడుకు చెంచుకృష్ణయ్య స్థానిక వైఎస్సార్‌ సర్కిల్‌ వద్ద న్యూడిల్స్‌ దుకాణం నిర్వహిస్తున్నారు. నెల క్రితం శ్రీనివాసులు కూతురు వనజాక్షి గూడూరుకు చెందిన ఓ యువకుడిని ప్రేమించి ఇంట్లో తెలియకుండా వివాహం చేసుకుంది. ఈ విషయం భార్య వెంకరమణమ్మకు తెలిసిన్పటికీ భర్తకు తెలియకుండా దాచింది. క్రమంలో ఆదివారం రాత్రి కూతురు నెల్లూరులో కాపురం ఉందని తెలుసుకుని చూచి వద్దామని ఆటోలో వెళ్లారు. నెల్లూరులో కూతురు, అల్లుడిని కలిసి తర్వాత శ్రీనివాసులు ఆగ్రహంతో వారిపై గొడవకు దిగాడు.

కూతురిని తనతో రావాలని కోరాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. భార్య సర్ది చెప్పడంతో మనుబోలుకు తిరుగు ప్రయాణమయ్యారు. దారిపొడుగునా కూతురి ప్రేమ విషయం తెలిసినా తన వద్ద దాచిందని గొడవ పడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఆటో పీడీఆర్‌ గార్డెన్‌ వద్దకు వచ్చే సరికి పం క్చర్‌ అయిందని ఆపాడు. అక్కడ భార్యాభర్తలిద్దరూ మళ్లీ గొడవపడ్డారు. మాటామాటా పెరిగి శ్రీనివాసులు ఇనుప రాడ్‌తో భార్య తలపై కొట్ట డంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనివాసులు ఉదయం వీఆర్వో సాయంతో పోలీ సుల వద్ద లొంగిపోయాడు. తల్లి హత్యకు గురైన విషయం తెలిసి కొడుకు చెంచుకృష్ణయ్య ఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించాడు. గూడూరు సీఐ అక్కేశ్వరరావు, ఎస్సై శ్రీనివాసులురెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసులును అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

దోషులను కఠినంగా శిక్షించాలి
గూడూరు: తమ బిడ్డను దారుణంగా హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని హతురాలి బంధువులు డిమాండ్‌ చేశారు. సోమవారం ఏరియా ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కంపేటకు చెందిన శ్రీనివాసులు తన భార్య వెంకటరమణమ్మను ఆదివారం రాత్రి అతికిరాతకంగా హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన నేపథ్యంలో ఆమె బంధువులు మాట్లాడుతూ శ్రీనివాసులు ఒక్కడే హత్య చేయలేదని, అతని బంధువుల ప్రమేయం కూడా ఉంటుందని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వారు పోలీసులను కోరారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top