ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతోందని.. భార్యను | Husband Killed By Wife Khammam | Sakshi
Sakshi News home page

ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతోందని.. భార్యను

Dec 2 2018 10:29 AM | Updated on Dec 2 2018 10:29 AM

Husband Killed By Wife Khammam - Sakshi

హత్యాస్థలిని పరిశీలిస్తున్న ఏసీపీ ప్రసన్నకుమార్‌

వైరా: అతడిలోని అనుమానం.. పెను భూతంగా మారింది. తనతో పదిహేనేళ్లపాటు కలిసి జీవించిన భార్యను దారుణంగా కొట్టి చంపాడు. పట్టణంలోని సత్రం బజార్‌లో శనివారం ఇది జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు... కొణిజర్ల మం డలం చిన్నమునగాల గ్రామస్తురాలు రాయల పద్మకు(30), వైరాకు చెందిన కృష్ణతో వివాహమైంది. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఆమె రెండు నెలల నుంచి చిన్నమునగాలలోని తన పుట్టింటిలో ఉంటోంది. రెండు రోజుల కిందటే అతడు ఆమెను వైరాకు తీసుకొచ్చాడు.

ఆమె తరచూ ఫోన్‌లో మాట్లాడుతోంది. దీంతో, ఆమె ప్రవర్తనను అతడు అనుమానించాడు. ఆవేశంలో, ఇంట్లోని సుత్తితో ఆమె నుదుటిపై గట్టిగా కొట్టాడు. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆ తరువాత అతడు కూడా పురుగు మందు తాగి, సమీపంలో ఓ కళాశాల వద్దకు వెళ్లాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు... ఎనిమిదేళ్ల కార్తీక్, ఐదేళ్ల కళ్యాణ్‌ ఉన్నారు.ఖమ్మంలోని హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. తన కొడుకు, కోడలి గొడవపడ్డారని, ఆ క్రమంలోనే హత్య జరిగిందని పోలీసులతో కృష్ణ తల్లి చెప్పింది. హత్యాస్థలిని ఏసీపీ దాసరి ప్రసన్నకుమార్, సీఐ రమాకాంత్, ఎస్సై టి.నరేష్‌ పరిశీలించారు. ఆధారాలను ఖమ్మం నుంచి వచ్చిన క్లూస్‌ టీం సేకరించింది. పోలీసు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement