ప్రాణం తీసిన ఆస్తి వివాదం | Husband Killed Wife On Assets Conflicts | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఆస్తి వివాదం

Mar 31 2018 8:51 AM | Updated on Mar 31 2018 8:51 AM

Husband Killed Wife On Assets Conflicts - Sakshi

దేవి మృతదేహం, దేవి (ఫైల్‌)

భాగ్యనగర్‌కాలనీ: ఆస్తి విషయంలో తాను చెప్పినట్లు వినటం లేదని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను గొంతు నులిమి దారుణంగా హత్య చేసిన సంఘటన మూసాపేట రాఘవేంద్ర సొసైటీలో వెలుగు చూసింది.  కూకట్‌పల్లి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా,  కొక్కిర్యాల తండాకు చెందిన జర్పల శ్రీను, దేవి (27) దంపతులు రాఘవేంద్ర సొసైటీలో నివాసముంటున్నారు. శ్రీను స్థానిక డ్రైక్లీనింగ్‌ షాపులో పనిచేస్తుండగా, దేవి ఇంటివద్దనే ఉండేది. దేవి తల్లి ఇటీవల గ్రామంలోని భూమిని విక్రయించటంతో భార్యాభర్తల మధ్య గత కొంత కాలంగా ఆస్తి విబేధాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి వారి మధ్య గొడవ జరిగింది. తన మాట వినకపోవడంతో సహనం కోల్పోయిన శ్రీను భార్యను తీవ్రంగా కొట్టడమేగాక, గొంతు నులిమి హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాం«ధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శ్రీను పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement