మత్తులో ఉన్నట్లుగా నటించి.. | Husband Catches Red Handed Wife Fornication Relationship | Sakshi
Sakshi News home page

యువకుడికి దేహశుద్ధి

Mar 10 2018 9:07 AM | Updated on Mar 10 2018 9:07 AM

Husband Catches Red Handed Wife Fornication Relationship - Sakshi

స్తంభానికి కట్టేసిన గ్రామస్తులు

డి.హిరేహాళ్‌: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడిని ఆమె భర్త దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన ఘటన సోమలాపురంలో జరిగింది. గ్రామంలోని ఓ మహిళ తన భర్త మద్యం మత్తులో ఉన్న సమయంలో రామాంజనేయులు అనే యువకుడిని పిలిపించుకుని వివాహేతర సంబంధం కొనసాగించేది.

భార్య ప్రవర్తనపై అనుమానం కలిగిన ఆ భర్త గురువారం రాత్రి మద్యం మత్తులో ఉన్నట్లుగా నటించాడు. నిజంగా మత్తులో ఉన్నాడనుకున్న భార్య యథా ప్రకారం ఆ యువకుడిని పిలిపించుకుంది. ఇంట్లోకి రాగానే రామాంజనేయులును ఆమె భర్త పట్టుకుని, విద్యుత్‌ స్తంభానికి కట్టేసి కొట్టాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ వెంకటరమణ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement