
హత్యకు గురైనా కుమారి
బొమ్మలసత్రం: భార్యను భర్త అతి కిరాతకంగా చంపిన ఘటన సోమవారం రాత్రి నంద్యాల మండలం రైతునగరంలో చోటు చేసుకుంది. రూరల్ సీఐ దివాకర్‌రెడ్డి తెలిపిన వివరాలు... రైతునగరానికి చెందిన చలపతిగౌడ్, కుమారి(49)లకు 34 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు కుమారులున్నా రు. కూలి పని చేసే చలపతిగౌడ్ కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో తరచూ భార్య, భర్తల మధ్య గొడవలు జరిగేవి. సోమవారం రాత్రి మద్యం తాగి భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయి కత్తెరతో విచక్షణా రహితంగా పొడవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఉదయం కుమారుడు హర్షవర్దన్‌గౌడ్ లేచి చూడగా తల్లి మృతదేహం రక్తపు మడుగులో పడిఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. çఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించి నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.