ప్రైవేటు స్కూల్‌ ఉపాధ్యాయుడిపై కేసు | Harassment Case File on School Teacher in Medak | Sakshi
Sakshi News home page

ప్రైవేటు స్కూల్‌ ఉపాధ్యాయుడిపై కేసు

Jul 3 2019 7:02 AM | Updated on Jul 3 2019 7:02 AM

Harassment Case File on School Teacher in Medak - Sakshi

అసభ్య పదజాలంతో దూషిస్తూ మానసిక వేధనకు గురి చేస్తున్నాడని బాధితురాలు తెలిపింది.

కొండపాక(గజ్వేల్‌): ఓ ప్రైవేటు స్కూల్లో తోటి ఉపాధ్యాయురాలిని వేధించిన ఉపాధ్యాయుడిపై కేసు నమోదైన సంఘటన దుద్దెడలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ అంశంపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కుకునూరుపల్లి ఎస్సై పరమేశ్వర్‌ తెలిపారు. కేసుకు సంబంధించి ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మండల పరిధి.లోని దుద్డెడలో గల ఓ ప్రైవేటు పాఠశాలల్లో సిద్దిపేట పట్టణానికి చెందిన పడిగే గణేష్‌ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయురాలిని కొంత కాలంగా వేధింపులకు గురి చేస్తుండటంతో పాటు అసభ్య పదజాలంతో దూషిస్తూ మానసిక వేధనకు గురి చేస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఈ విషయమై పలుమార్లు హెచ్చరించినా గణేష్‌లో మార్పు రావడం లేదని తెలిపారు. దీంతో మహిళా ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఎస్సై పరమేశ్వర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం నిందితుడు గణేష్‌ పరారీలో ఉన్నాడని ఎస్సై పరమేశ్వర్‌ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement