అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ! | Gun fire at Maryland in america | Sakshi
Sakshi News home page

అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ!

Oct 18 2017 9:29 PM | Updated on Apr 4 2019 3:25 PM

Gun fire at Maryland in america - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మేరీల్యాండ్‌లో గుర్తుతెలియని దుండగుడు జరిపిన ​కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డట్లు సమాచారం. స్థానిక మేరీల్యాండ్‌ బిజినెస్‌ పార్కులో ప్రవేశించిన సాయుధుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి జనాలకు ముచ్చెమటలు పట్టించాడు. దుండగుడి కాల్పుల మోతతో అక్కడున్నవారు ప‍్రాణభయంతో పరుగులుతీశారు.

నిందితుడిని రాడీ లాబీబ్‌ ప్రిన్స్‌గా పోలీసులు గుర్తించారు. 2000 బ్లాక్‌ జీఎంసీ అకాడియా ఎస్‌యూవీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారులో నిందితుడు పార్కుకు వచ్చినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement