మనవరాలిపై అత్యాచారం ..!

Grand Daughter Molested By An Old Man In Kurnool - Sakshi

ఓ వృద్ధుడి దాష్టీకం 

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన  

సాక్షి, కోవెలకుంట్ల: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి వరుసకు మనవరాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మండలంలోని రేవనూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల ఎం.ఉప్పలూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ రమేష్‌కుమార్‌ అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎం.ఉప్పలూరు గ్రామానికి చెందిన జింకల పుల్లయ్య (60).. మానసిక స్థితి సరిగా లేని మనవరాలి వరుసయ్యే బాలిక (16)తో కలిసి ఆరు నెలల క్రితం గొర్రెలు మేపుకునేందుకు పొలానికి వెళ్లాడు. ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధితురాలికి మతిస్థిమితం లేకపోవడంతో అప్పట్లో ఈ విషయం బయటకు పొక్కలేదు. రెండు రోజుల క్రితం ఆ యువతిని ఆసుపత్రికి తీసుకెళ్లగా..ఆరు నెలల గర్భవతిగా డాక్టర్లు ధ్రువీకరించారు. దీంతో  యువతి బంధువులు పుల్లయ్యను నిలదీయడంతో అత్యాచారానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పుల్లయ్యను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తలిలించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top