వాట్సాప్‌లో ఐ లవ్‌ యూ.. అధికారి సస్పెన్షన్‌

Government Employee Suspended For Molestation Women Employee - Sakshi

సాక్షి, చెన్నై : మహిళా ఉద్యోగికి వాట్సాప్‌లో ఐ లవ్‌యూ అంటూ మెసేజ్‌ పంపిన సూళగిరి ఉప తాలూకా అభివృద్ధి అధికారిని శుక్రవారం సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. కృష్ణగిరిలో రాయకోటై రోడ్డులో నివసిస్తున్నారు కుమరేశన్‌ (51). ఈయన కృష్ణగిరి తాలూకా అభివృద్ధి కార్యాలయంలో అధికారిగా పనిచేస్తూ వచ్చారు.  ఇటీవల సూళగిరి యూనియన్‌కు బదిలీ అయ్యారు. ఇలాఉండగా సూళగిరి కార్యాలయంలో పని చేస్తున్న మహిళా జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగి వాట్సాప్‌ నంబరుకు ఐ లవ్‌ యూ అంటూ మెసేజ్‌ పంపారు. దీని గురించి జిల్లా ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు అందడంతో శాఖాపరమైన విచారణకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విచారణలో కుమరేశన్‌ మహిళా ఉద్యోగికి మెసేజ్‌ పంపినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో కలెక్టర్‌ ప్రభాకర్‌ కుమరేశన్‌ను సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top