బంగారాన్ని స్క్రూ డ్రైవర్‌ రూపంలో తరలిస్తూ.. | gold in the form of screw driver.. | Sakshi
Sakshi News home page

బంగారాన్ని స్క్రూ డ్రైవర్‌ రూపంలో తరలిస్తూ..

Feb 7 2018 8:25 PM | Updated on Feb 7 2018 8:25 PM

gold in the form of screw driver.. - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తూర్పుగోదావరి జిల్లా : రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో భారీగా బంగారం పట్టుకున్నారు. బంగారాన్ని టూల్‌ కిట్‌లోని స్క్రూ డ్రైవర్‌ రూపంలో తరలిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. అయినా గానీ పోలీసులకు చిక్కాడు. పట్టుబడిన బంగారం రెండున్నర కిలోలు ఉంటుందని అధికారులు తెలిపారు. గుహాహటి నుంచి చెన్నై వెళ్తున్న రైలులో ఈ బంగారంను స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన బంగారం విలువ రూ.77 లక్షల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  బంగారం మయన్మార్‌ నుంచి అక్రమంగా తీసుకువచ్చినట్లు గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి ఓ ప్రయాణికుడిని డైరెక్టరేట్‌ ఆప్‌ రెవిన్యూ(డీఆర్‌ఐ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.   పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement