యువకుడి వేధింపులు.. బాలిక ఆత్మహత్య | Girl suicide with the harrassment of young man | Sakshi
Sakshi News home page

యువకుడి వేధింపులు.. బాలిక ఆత్మహత్య

Nov 5 2018 1:05 AM | Updated on Nov 5 2018 1:05 AM

Girl suicide with the harrassment of young man - Sakshi

ధర్నా చేస్తున్న మృతురాలి బంధువులు

కోల్‌సిటీ(రామగుండం): యువకుడి వేధింపులు తాళలేక ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గోదావరిఖని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నేహ(15) నానమ్మ జులేఖాబేగం వద్ద ఉంటోంది. శనివారం ఆమె నానమ్మ తో కలిసి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాబాయ్‌ రజాక్‌ ఇంటికి వెళ్లింది. సాయంత్రం బాబాయ్, నానమ్మ పనిమీద బయటకు వెళ్లిన సమయంలో నేహ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వద్ద ‘నన్ను క్షమించండి.. నేను ఏ తప్పు చేయలేదు’ అని రాసి ఉన్న సూసైడ్‌ నోట్‌ లభించింది.

ముత్తారం మండలం ఖమ్మంపల్లికి చెందిన మాతంగి కిరణ్‌ అలియాస్‌ నిఖిల్‌ కొంతకాలంగా ప్రేమ పేరుతో నేహను వేధింపులకు గురిచేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని మృతిరాలి బాబాయ్, నానమ్మ తెలిపారు. నిం దితుడిని అరెస్ట్‌ చేయాలని మృతు రాలి బంధువులు, ముస్లింలు గోదావరిఖని గాంధీచౌక్‌ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. సీఐలు వాసుదేవరావు, మహేందర్‌ జోక్యం చేసుకొని వారికి నచ్చజెప్పారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement