చిన్నారి కిడ్నాప్‌.. రూ.60లక్షల డిమాండ్‌

Girl Child Kidnap And Demands 60lakhs in Tamil Nadu - Sakshi

పనిమనిషి సహా ఇద్దరు అరెస్టు

తమిళనాడు, తిరువొత్తియూరు: చెన్నై అమందకరై షెనాయ్‌ నగర్‌ చెల్లమ్మాల్‌ వీధికి చెందిన అరుల్‌రాజ్‌ ప్రైవేటు సంస్థ ఉద్యోగి. అతని భార్య నందిని ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్‌గా ఉన్నారు. వీరి కుమార్తె అన్వికా (03). గురువారం సాయంత్రం చిన్నారి అన్వికా, పనిమనిషి అంబిక (25) అదృశ్యమైనారు. దుకాణానికి వెళ్లి ఉండవచ్చునని తల్లిదండ్రులు అనుకున్నారు. కాని వారిద్దరు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన నందిని కుమార్తె కోసం అన్ని చోట్ల గాలించారు. కొద్ది సమయం తర్వాత పనిమనిషి అంబిక ఫోన్‌ నుంచి నందిని సెల్‌ఫోన్‌కు ఒక కాల్‌ వచ్చింది. ఆమె తనను, చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని తాము ఎక్కడ ఉన్నామో తెలియలేదని కాపాడమని చెప్పినట్టు తెలిసింది. దీంతో భయాందోళనకు గురైన నందిని ఈ సంగతి గురించి తన భర్త అరుల్‌రాజ్‌కు సమాచారం ఇచ్చారు. కొద్ది సమయం తర్వాత అదే ఫోన్‌ నుంచి నందినికి ఫోన్‌ చేసిన గుర్తు తెలియని వ్యక్తి చిన్నారి, అంబిక ప్రాణాలతో బయట పడాలంటే రూ.60 లక్షలు ఇవ్వాలని బెదిరింపులు ఇచ్చాడు.

దీంతో అమందైకరై పోలీసుస్టేషన్లో నందిని ఫిర్యాదు చేశారు. పోలీసు కమిషనర్‌ కె.కె.విశ్వనాథన్, అదనపు కమిషనర్‌ దినకరన్, జాయింట్‌ కమిషనర్‌ విజయకుమారి, డిప్యూటీ కమిషనర్‌ముత్తుస్వామి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని అమందకరై ప్రాంతంలో వున్న ఈసీటీవీలో తనిఖీ చేశారు. అలాగే జాయింట్‌ కమిషనర్‌ విజయకుమారి నేతృత్వంలో ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టారు. అంబిక ఫోన్‌ నెంబరు ఆధారంగా వారు కోవలంలో వున్నుట్టు గుర్తించారు. పోలీసులు అక్కడికి వెళ్లి కారును చుట్టుముట్టడంతో కారులో వున్న ముగ్గురు పారిపోయారు. తరువాత చిన్నారిని సురక్షితంగా కాపాడారు. కారులో వున్న పనిమనిషి అంబిక, మహ్మద్‌ అలీబుల్లాను పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేయగా అంబికను మహ్మద్‌ అలీబుల్లా ప్రేమిస్తున్నాడని వివాహం చేసుకోవడానికి ఖర్చుల కోసం వారిద్దరు డాక్టర్‌ కుమార్తెను కిడ్నాప్‌ చేసి నాటకమాడినట్టు తెలిసింది. దీంతో అంబికను, ఆమె ప్రియుడు మహ్మద్‌ అలీబుల్లాను పోలీసులు అరెస్టు చేశారు. కారు నుంచి పారిపోయిన ముగ్గురు దుండగుల వివరాల కోసం విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top