ఏసీబీకి చిక్కిన కూకట్‌పల్లి బిల్‌ కలెక్టర్‌ | GHMC bill collector held for taking bribe in Kukatpally circle | Sakshi
Sakshi News home page

May 20 2019 7:12 PM | Updated on May 20 2019 7:19 PM

GHMC bill collector held for taking bribe in Kukatpally circle - Sakshi

ఆస్తి పన్ను తగ్గించేందుకు ఓ షాపు యజమాని వద్ద డబ్బులు డిమాండ్‌ చేసిన ఓ బిల్‌ కలెక్టర్‌ను ఏసీబీ అధికారులు సోమవారం

సాక్షి, కూకట్‌పల్లి: ఆస్తి పన్ను తగ్గించేందుకు ఓ షాపు యజమాని వద్ద డబ్బులు డిమాండ్‌ చేసిన ఓ బిల్‌ కలెక్టర్‌ను ఏసీబీ అధికారులు సోమవారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కూకట్‌పల్లి సర్కిల్‌–24లోని ఆస్‌బెస్టాస్‌ కాలనీ ఏరియాకు బిల్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న మహేంద్రనాయక్‌ కాలనీలోని రాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూంకు సంబంధించి ఆస్తి పన్నును తగ్గించేందుకు రూ.36 వేలు డిమాండ్‌ చేయగా షాపు యజమాని ఎం.నాగరాజు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో అధికారులు కెమికల్‌ కలిపిన నోట్లను నాగరాజుకు ఇచ్చి పంపారు. డబ్బులు తీసుకునేందుకు షాపు వద్దకు వచ్చిన మహేంద్రనాయక్‌కు డబ్బులు ఇవ్వగానే ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు మహేంద్రనాయక్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement